ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి - ఏలూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తాజా వార్తలు

ap high court permission to eluru muncipal election counting
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి

By

Published : May 7, 2021, 10:56 AM IST

Updated : May 7, 2021, 11:41 AM IST

10:53 May 07

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై హైకోర్టు ఆదేశాలు

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు ధర్మాసనం అనుమతించింది. ఎస్‌ఈసీ ఇచ్చిన కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు అనుమతులిచ్చింది. 

           ఏలూరు పరిధిలోని వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో గందరగోళ పరిస్థితి ఉందని.. ఎన్నికలు నిలిపివేయాలంటూ పలువురు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టి ఎన్నికలు నిలివేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఫలితాల వెల్లడికి పచ్చజెండా ఊపింది.

ఇదీ చదవండి: 

లోపాలున్నాయ్ సరిదిద్దుకోండి.. చేతులు ముడుచుకొని కూర్చోవద్దు: హైకోర్టు

Last Updated : May 7, 2021, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details