పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధికి గురైన బాధితులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి 50 లక్షలు రూపాయలు ఇవ్వాలన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయినవారు... అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. ఏలూరు నగరంలోని తాగునీటి వనరులను తక్షణమే శుభ్రపరచాలన్నారు. ప్రస్తుత సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకూ ప్రభుత్వమే మంచినీటిని సరఫరా చేయాలని ప్రసాద్ పేర్కొన్నారు.
'ఏలూరు బాధితులకు రూ.50 వేలు చొప్పున పరిహారమివ్వాలి' - ఏలూరు ఘటన వార్తలు
ఏలూరు ఘటనలో బాధితులకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయినవారు... అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు.
CPI(ML) new democracy