పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీపీఎం కార్యాలయంలో ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ కేంద్రం వద్దకు వచ్చి తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు.
అలాగే... బయటికి రాలేని వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారి సమస్యలు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.