పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర మేయర్ అభ్యర్థిత్వం తనకు కేటాయించలేదని వైకాపా నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్.. మంత్రి ఆళ్ల నాని ఇంటి ముందు నిరసన తెలిపారు. ఆ స్థానాన్ని నూర్జహాన్కు కేటాయించి.. తనకు అన్యాయం చేశారంటూ తన కూతురు, భార్యతో మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. నగరంలోని వైకాపా కార్యకర్తలు, బొద్దాని అనుచరులు భారీగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. మంత్రి అనుచరులు వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా లాక్కెళ్లి వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. మంత్రి అనుచరుడిగా ఉంటున్న బొద్దాని శ్రీనివాస్.. ఇటీవలే నగర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా తనకు అవకాశం దక్కుతుందని ఆశపడ్డారు.
మేయర్ అభ్యర్థిత్వం దక్కలేదని మంత్రి ఇంటి ముందు ఆందోళన - మంత్రి ఆళ్ల నాని ఇంటి ముందు ఏలూరు వైకాపా అధ్యక్షుడు ధర్నా
ఏలూరు నగర మేయర్ అభ్యర్థిత్వం తనకు కేటాయించలేదని వైకాపా నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్.. మంత్రి ఆళ్ల నాని ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. మంత్రి అనుచరులు వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు.
మంత్రి ఆళ్ల నాని ఇంటి ముందు ధర్నా చేస్తున్న బొద్దాని శ్రీనివాస్