ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2020, 12:43 PM IST

ETV Bharat / city

ఏలూరు రోగుల నమూనాలు దిల్లీ ఎయిమ్స్​కు తరలింపు

అంతు చిక్కని సమస్యతో.. ఏలూరు ప్రభుత్వాస్వత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు రోగుల నుంచి నమూనాలు సేకరించి... దిల్లీలోని ఎయిమ్స్​కు పంపారు.

Eluru patient samples transferred to Delhi Aims
ఏలూరు రోగుల నమూనాలు దిల్లీ ఎయిమ్స్​కు తరలింపు

ఏలూరు ఆసుపత్రిలో రోగుల నుంచి మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు నమూనాలను సేకరించారు. ఎయిమ్స్ సూపరింటెండెంట్ డా. రాకేష్ కక్కర్ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రోగులను పరిశీలించారు. వారి నుంచి రక్తం, యూరిన్, సీఎఫ్ఎస్ నమూనాలను సేకరించారు.

ఎయిర్ కార్గో ద్వారా దిల్లీలోని ఎయిమ్స్​కు పరీక్షల నిమిత్తం తరలించారు. 24 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశముందని వైద్యులు తెలిపారు. కమ్యూనిటీ మెడిసిన్, క్రిటికల్ కేర్ యూనిట్, వైరాలజీ, మైక్రో బయాలజీకి చెందిన నిపుణుల బృందం ఏలూరు రోగులను పరిశీలించింది.

ABOUT THE AUTHOR

...view details