పోలవరం నిర్మాణంపై ముఖ్యమంత్రి నోరువిప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జలవనరుల మంత్రితో మాట్లాడిస్తే సరిపోదన్నారు. పులిచింతల గేట్ కొట్టుకుపోయి 9 నెలలైతే మంత్రి ఏం చేస్తున్నారని ఉమా నిలదీశారు.
'జగన్కు పాలన చేతకాకుంటే.. రాజీనామా చేయాలి' - సీఎం జగన్పై దేవినేని ఉమా విమర్శలు
పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం జగన్ నోరువిప్పాలని డిమాండ్ చేశారు. జలవనరుల మంత్రితో మాట్లాడిస్తే సరిపోదన్న ఉమా.. పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలని ధ్వజమెత్తారు.

దేవినేని ఉమా
' జగన్కు పరిపాలన చేతకాకుంటే... రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి'
మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్కప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. 6 ప్రాధాన్యతాప్రాజెక్టుల్లో ఎన్ని పూర్తిచేశారని నిలదీశారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. నిర్వాసితుల సొమ్ముని పందికొక్కుల్లా తింటున్నవాళ్లు.. ముఖ్యమంత్రికి, మంత్రి రాంబాబుకి కనిపించడం లేదా? అని ఉమా ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: