ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 1555 నమోదు - కొవిడ్ కేసుల వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ తారాస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా రికార్డుస్థాయిలో 1555 మందికి వైరస్‌ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరింది. కరోనా బారినపడి మరో 13 మంది మృతిచెందగా మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 277కు చేరింది. కేసులు ఎక్కువగా వస్తున్నందున కొన్నిచోట్ల దుకాణాలు తెరిచే వేళలు కుదిస్తున్నారు.

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 1555 నమోదు
రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 1555 నమోదు

By

Published : Jul 10, 2020, 6:01 AM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇప్పటివరకూ 10 కేసుల నమోదు కాగా...వైరస్‌ కట్టడి కోసం దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే తెరవాలని అధికారులు ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఒకే కాలనీలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం లేదంటూ వెంకన్నబాబు, పద్మావతి దంపతులు నిరసన దీక్ష చేపట్టారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కొత్తపల్లి పోలీస్ స్టేషన్​లో ఉంచిన ఓ నిందితుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో పోలీస్‌ సిబ్బందిని వైరస్‌ భయం వెంటాడుతోంది.

కరోనా అనుమానంతో ఆత్మహత్య

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలు ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఉదయం 11 గంటల వరకే దుకాణాలు తెరవాలని అధికారులు సూచించారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటివరకూ 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బద్వేలు అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ మెన్​కు కరోనా పాజిటివ్ రాగా మిగిలినవారికి పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల కోసం సిద్ధం చేసిన 54 ఆర్టీసీ ఇంద్రబస్సుల్లో కడప జిల్లాకు 4 మంజూరు చేశారు. ఆయా బస్సులు కడప డిపోకు చేరుకున్నాయి. కర్నూలులో ఒక వ్యక్తి కరోనా వచ్చి ఉంటుందన్న భయంతో తొందరపడి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. కరోనా నిర్థరణ కోసం నమునాలు ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉండగా... స్నానం చేసి వస్తానని ఇంటికి వెళ్లి బలవన్మరణం చెందారు. కరోనా పరీక్షల్లో మాత్రం ఆయనకు నెగిటివ్ వచ్చింది.

ప్రతి ఇంటి నుంచి శాంపిల్స్ సేకరణ

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు కొనుగోలుకు అనుమతిస్తున్నట్లు కలెక్టర్‌ నివాస్‌ ప్రకటించారు. ప్రతి ఇంటి నుంచి శాంపిల్స్ సేకరిస్తామని చెప్పారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనాతో ఒక వ్యక్తి మృతి మృతిచెందాడు. ప్రకాశం జిల్లా కనిగిరి చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున నేటి నుంచి 5 రోజుల పాటు అధికారులు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో త్వరలో పారిశ్రామిక ప్రాంతాల్లో క్వారంటైన్, క్లీనిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ శేషగిరిబాబు వెల్లడించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని నవనీత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్, క్లీనిక్ సెంటర్​ను ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఇదీ చదవండి :కరోనా పరీక్షల కోసం ఇంద్ర బస్సులు

ABOUT THE AUTHOR

...view details