దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు..పోలవరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై చర్చించినట్లు సమాచారం. రెవెన్యూ లోటు భర్తీ, విభజన చట్టం పెండింగ్ అంశాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ - CM Jagan meets PM Modi
పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనతో పాటు ఇతర సమస్యలపై ప్రధానితో సీఎం చర్చించారు.
![ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4058669-984-4058669-1565092711358.jpg)
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
అంతకుముందు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో జగన్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
Last Updated : Aug 6, 2019, 7:04 PM IST