ఇదీ చదవండీ...
'అలా అయితే... తెదేపాను శాశ్వతంగా మూసేస్తాం' - Chintamaneni Prabhakar latest news
శాసనసభను రద్దు చేసి... వైకాపా మళ్లీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తే... తెదేపాను శాశ్వతంగా మూసివేస్తామని మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ చేశారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు రాంమోహన్, మంతెన సత్యనారాయణరాజును సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు. సీఎం జగన్ తనకు నచ్చనివన్నీ రద్దు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకనే... వివేకానందరెడ్డి కూతురు తన తండ్రిహత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించిందని పేర్కొన్నారు.
మాట్లాడుతున్న చింతమనేని ప్రభాకర్