పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వెంకన్నబాబు అనే నాలుగేళ్ల బాలుడ్ని మేనమామ వెంకటేష్ చిత్రహింసలకు గురిచేశాడు. బాలుడి తల్లి ఇంట్లోలేని సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు వెంకటేష్... బాలుడు వెంకన్నను బెల్టుతో దారుణంగా కొట్టాడు. అతడి రోదనలు విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు సైతం ఘటనను వివరించాడు. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చైల్డ్ లైన్ సహాయంతో తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి వెంకన్నను అప్పగించారు.
నాలుగేళ్ల బాలుడిని.. బెల్టుతో వాతలు పడేలా కొట్టిన మేనమామ - ఏలూరు వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నాలుగేళ్ల బాలుడ్ని మేనమామ చిత్రహింసలకు గురిచేశాడు. బెల్టుతో వాతలు పడేటట్లు కొట్టాడు. బాలుడి రోదనతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.

Uncle harassment
నాలుగేళ్ల బాలుడ్ని చిత్రహింసలు పెట్టిన మేనమామ