Boats Rally: నరసాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కొనసాగించే ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు హెచ్చరికలు జారీచేశారు.
Boats Rally: ప్రభుత్వంపై పడవల పోరు.. వరుసకట్టిన బోట్లు! - Boats Rally in Narasapuram
Boats Rally: జిల్లా కేంద్ర సాధన కోసం నాయకులు వినూత్ననిరసనలు చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రి, వైకాపా నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రధాన పంట కాల్వలో పడవల ర్యాలీ నిర్వహించారు.
మొగల్తుర్రులో జేఏసీ ఆధ్వర్యంలో నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రధాన పంట కాల్వలో పడవల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా.. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలి అన్నట్లు ముద్దనూరు ప్రసాద్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రం ప్రకటన వచ్చేవరకూ ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి :Suicide: యువకుడి ఆత్మహత్య.. సీఐ కొట్టడం వల్లేనంటూ బంధువుల ఆందోళన