కరోనా విజృంభిస్తున్న వేళ ఏలూరులో లాక్ డౌన్ విధించారు. ఉదయం నుంచే అన్ని దుకాణాలు మూసివేశారు. హోల్ సేల్ దుకాణాలు మూతపడగా ఒక్కసారిగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఒకటో పట్టణ పరిధిలోనే చేపలు, మాంసం, కూరగాయాల మార్కెట్లు ఉన్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల చిరువ్యాపారులు... ఇక్కడే నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం చిరువ్యాపారులు తాడేపల్లిగూడెం, విజయవాడకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధరలు పెరిగాయని ప్రజలు అంటున్నారు.
ఏలూరులో లాక్డౌన్... సరకుల ధరలకు రెక్కలు - చిరువ్యాపారులు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఒకటో పట్టణ పరిధిలో లాక్ డౌన్ విధించారు. ఉదయం నుంచే వ్యాపార సంస్థలు, దుకాణాలు, హోల్ సేల్ వ్యాపారాలు మూసివేశారు.
ఏలూరులో లాక్ డౌన్.. పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు