ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పరామర్శించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులను అడిగి వ్యాధి తీవ్రత, లక్షణాలు, చికిత్స గురించిన విషయాలు వాకబు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఏలూరులో ఇటువంటి పరిస్థితి కొనసాగుతున్నా.. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నివేదిక కూడా బయటపెట్టలేదని విమర్శించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. బాధితులు ఎక్కువమంది రోజువారీ పనులు చేసుకునే వారు అయినందున.. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.