ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితుల సంఖ్య.. 505కి చేరింది. 3 రోజుల్లో 332 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 153 మందికి చికిత్స కొనసాగుతోంది. చికిత్స పొందుతున్నవారిలో 71 మంది చిన్నారులు ఉండగా.. 27 మంది మహిళలు ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడకు 19 మందిని తరలించారు.
ఏలూరు: చిన్నారులనూ వదలని వింత వ్యాధి - ఏలూరు తాజా వార్తలు
అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళ్తున్నవారి సంఖ్య ఏలూరులో మరింతగా పెరుగుతోంది. నాలుగు రోజులుగా ఈ సమస్య ఏలూరు ప్రజలను వేధిస్తోంది. ఇప్పటి వరకు 505 మంది బాధితులను గుర్తించగా..153 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

eluru cases taza