ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కోసమే ప్రతిపక్షనేత జగన్.. ఫామ్ - 7 ను దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. తెదేపా సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో 18 వేల పైచిలుకు ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ...రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. భాజపాతో కుమ్మక్కై ఈ తరహా కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.