అనంత వేదికగా.. 'కార్తీక్ వజ్ర సంకల్పం' ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో వచ్చారు కార్తిక్. రెండు కళ్లు లేకున్నా.. ఎంబీఏ వరకు చదివారు. సమాజసేవలో భాగమై.. ప్రజలకు సేవచేయాలని భావించారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న నలుగురికీ ఎన్నికల గుర్తుగా వజ్రం కోసం చీటీలు.. వేయగా ఆ గుర్తును కార్తిక్ కైవసం చేసుకున్నారు. వజ్రం లాంటి సంకల్పంతో ఎమ్మెల్యేగా గెలుస్తానని.. ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని సాధిస్తాననీ విశ్వాసంగా చెబుతున్న కార్తీక్‌తో... ఈటీవీ భారత్ ముఖాముఖి.