YS Sharmila Comments: రాష్ట్రంలో తెరాస కొనటం.. కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోవటం పరిపాటిగా మారిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన షర్మిల.. తెరాస, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ రాజులా.. కేటీఆర్ యువరాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తికి పగ్గాలిస్తే నేతలు అమ్ముడుపోకుండా ఎందుకు ఉంటారని.. ఎద్దేవా చేశారు. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.
ఆయన రాజు.. ఈయన యువరాజులా వ్యవహరిస్తున్నారు : షర్మిల - వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల
YS Sharmila Comments: తెరాస, కాంగ్రెస్ పార్టీలపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెరాసతో పొత్తు ఉండదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి అవకాశమూ లేదని స్పష్టం చేశారు.
"సీఎం కేసీఆర్ తన పార్టీ నిధుల నుంచి రైతులకు పరిహారం చెల్లించాలి. ఫాంహౌస్ నుంచి సీఎం కేసీఆర్ బయటకు రావాలి. రైతులకు మేలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌కు లేదు. కేసీఆర్, కేటీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు. కేసీఆర్ రాజులా.. కేటీఆర్ యువరాజులా వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌కు కూడా తెరాస కనీస మర్యాద ఇవ్వడం లేదు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఎందుకు ఏర్పాటుచేయట్లేదు. తెరాస కొనడం.. కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోవడం పరిపాటిగా మారింది. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తికి పగ్గాలిస్తే నేతలు అమ్ముడుపోతారు. తెరాసతో పొత్తు ఉండదని చెప్పారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కూడా రాదు. మా పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది." - షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
ఇవీ చూడండి: