ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 23, 2021, 1:35 PM IST

ETV Bharat / city

Sharmila Padayatra: నాలుగోరోజు షర్మిల 'ప్రజాప్రస్థానం' పాద్రయాత్ర.. షెడ్యూల్ ఇదే

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra) నాలుగో రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పోశెట్టిగూడ క్రాస్ రోడ్​లో ఉదయం 9.30 గంటలకు యాత్ర ప్రారంభమైంది. మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామానికి సాయంత్రం 6 గంటల వరకు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేస్తారు.

YS Sharmila Padayatra 2021
YS Sharmila Padayatra 2021

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా... వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర(YS Sharmila Padayatra) నాలుగో రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పోశెట్టిగూడ క్రాస్ రోడ్​లో ఉదయం 9.30 గంటలకు యాత్ర ప్రారంభమైంది. గొల్లపళ్లి గ్రామం, రషీద్​గూడ గ్రామం, హామీదుల్లానగర్​కు చేరుకుని... మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసి స్వల్ప విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం హామీదుల్లానగర్ నుంచి పాదయాత్ర(YS Sharmila Padayatra) తిరిగి ప్రారంభమవుతుంది. చిన్నగోల్కొండ గ్రామం, బహదూర్ గూడ క్రాస్ , పెద్దగోల్కొండ గ్రామం, మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామానికి సాయంత్రం 6 గంటల వరకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

పాదయాత్ర వివరాలు

తెలంగాణలో సంక్షేమ పాలన లేదని.. తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర (YS Sharmila padayatra news) మొదలుపెడుతున్నామని షర్మిల తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర 400 రోజుల పాటు 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4వేల కి.మీ మేర సాగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. వైఎస్​ఆర్ సంక్షేమ పాలన అంటే రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫీ, పిల్లలకు ఉచిత విద్య పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడమే అని షర్మిల అన్నారు.

మొదటిరోజు పాదయాత్ర

మొదటిరోజు మధ్యాహ్నం చేవేళ్ల మండలంలోని శంకర్​పల్లి క్రాస్​రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభ అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రను విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ షర్మిల రెండున్నర కిలోమీటర్లు నడిచి.. షాబాద్ క్రాస్​రోడ్​కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్​రోడ్డు వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు.అక్కడ మధ్యాన భోజనం చేశారు. గంట విరామం తర్వాత కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. 6.5 కిలోమీటర్లు ప్రయాణించి కందవాడ గ్రామానికి, అక్కడి నుంచి గుండాల్ క్రాస్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగూడా క్రాస్​రోడ్డుకు చేరుకున్నారు. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర పూర్తిచేశారు. మొదటిరోజు నక్కలపల్లి సమీపంలో రాత్రి బస చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details