వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఈ రోజు నుంచి పది రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేపట్టాలని వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. 'ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు' పేరిట 10రోజులు పాటు పార్టీ కార్యకర్తలంతా కార్యక్రమాలు నిర్వహించి... సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలతో కూడిన వీడియోలను ప్రత్యేకంగా ప్రదర్శించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఊహకు అందలేని రీతిలో అప్పులను గత ప్రభుత్వం అప్పగించి పోయిందని .. ఎంత ఖర్చయినా వెనకడుగు వేయకుండా హామీలు సీఎం నెరవేర్చుతున్నారని సజ్జల అన్నారు. కరోనాతో ఆర్థిక కష్టాలు వచ్చినా... హామీలను, సంక్షేమ పథకాలు, అభివృద్దిని కొనసాగించారన్నారు.