ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

parliament session: రేపు వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల, కృష్ణా జలాల వివాదం, రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టుల పుర్తి అంశాలను ప్రస్తావించే అంశంపై ఎజెండా ఖరారు చేయనున్నారు.

ysrcp parliamentary party meeting
రేపు వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

By

Published : Jul 14, 2021, 2:07 PM IST

త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (parliament session) ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. వైకాపా లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు.

పోలవరం (polavaram) ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల, కృష్ణా జలాల వివాదం (water disputes), రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టుల పుర్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల అంశాలను ప్రస్తావించే అంశంపై ఎజెండా ఖరారు చేయనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల, కొవిడ్ దృష్ట్యా అదనంగా ఆర్థిక సాయం, రుణ పరిమితి తగ్గింపు అంశం, ప్రత్యేక హోదా సహా తదితర అంశాల ప్రస్తావన సహా పోరాటం చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details