భాజపా ప్రభుత్వం ఏడేళ్లు సమయం తీసుకున్నా రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీల అమలుకు ఏ చర్య తీసుకోలేదని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ... ‘ఆర్థిక మంత్రి భారీ బడ్జెట్‌ను పెట్టారు. అందులో ఆంధ్రప్రదేశ్ లేదు. పునర్విభజన చట్టంలో పేర్కొని ఏడేళ్లయినా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పడలేదు. వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి.
విభజన హామీలపై ఏడేళ్లుగా ఏమీ చేయలేదు - MP Vijayasaireddy speaking on ap bifergation Act
రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీలను అమలు చేయటంలో భాజపా పూర్తిగా విఫలమైందని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర జల సంఘం, పోలవరం సవరించిన అంచనాలనుపై ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.
కేంద్ర జల సంఘం పోలవరం సవరించిన అంచనాలను రూ.55,656 కోట్లుగా సిఫార్సు చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందించాలి. భాజపా తాను హిందువులు, హిందువుల ఆలయాలకు టార్చ్‌బేరర్‌గా పేర్కొంటోంది. జీఎస్టీ రాకముందు తితిదే రూపాయి చెల్లించేది కాదు. ప్రస్తుతం ఏటా రూ.120 కోట్లు చెల్లిస్తోంది. కేవలం రూ.9 కోట్లు వెనక్కి ఇస్తున్నారు. ప్రసాదాలతో సహా అన్నింటిపైనా జీఎస్టీ వేస్తున్నారు. కాటేజీల్లో భక్తులు ఉంటారు. కాటేజీ అద్దెలపైనా జీఎస్టీ వేయడం అన్యాయం. హిందువుల పార్టీగా చెప్పుకొనే భాజపా హిందువులకు న్యాయం చేయాలి’ అని కోరారు.