లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు - ఏపీ తాజా వార్తలు
![లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు mp raghu rama raju arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11829139-769-11829139-1621502551166.jpg)
13:53 May 20
లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన ఎంపీ రఘురామ కుటుంబసభ్యులు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు కలిశారు. రఘురామ సతీమణి రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందూ ప్రియదర్శిని స్పీకర్‌తో భేటీ అయ్యారు. రఘురామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రఘురామపై రాజద్రోహం కింద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. అంతకుముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ రఘురామ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. వైకాపా ప్రభుత్వం రఘురామను కుట్రపూరితంగా వేధింపులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉందని.. జగన్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి