రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కోళ్ల పెంపకదారులపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రాలో కోళ్ల పెంపకం కొందరి జీవనాధారమని.. ఆలాంటప్పుడు కేసులు ఎలా పెడతారని నిలదీశారు. కోళ్లు పెంచుకోవటం నేరమని ఏ చట్టంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తే అడ్డుకోవాలని, అనవసరంగా ఇళ్లపై పడి కోళ్లను స్వాధీనం చేసుకోవటం.. కేసులు నమోదు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు లోను చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు.
'కోళ్లు పెంచుకోవటం నేరమని ఏ చట్టంలో ఉంది' - ఈరోజు ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వ్యాఖ్యలు
కోళ్లు పెంచుకోవటం నేరమని ఏ చట్టంలో ఉందో చెప్పాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు