Ambati Comments Ukku Deeksha: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో.. రాష్ట్ర సర్కారు తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై.. వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. విశాఖ ఉక్కుపై పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. మిత్రపక్షాన్ని నిలదీసే ధైర్యం పవన్ కు ఉందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై తాము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. ఈ విషయంలో వైకాపా కేంద్రంతో పోరాడుతోందన్నారు.
Ambati Rambabu on pawan : 'కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం.. పవన్‌కు ఉందా?' - పవన్ కల్యాణ్ ఉక్కు దీక్షపై వైకాపా స్పందన
Ambati Comments Ukku Deeksha: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో పవన్ కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని వైకాపా శాసనసభ్యుడు అంబటి రాంబాబు సూచించారు. మిత్రపక్షమైన భాజపా ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం పవన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.
![Ambati Rambabu on pawan : 'కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం.. పవన్‌కు ఉందా?' ambati rambabu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13888930-thumbnail-3x2-ambati.jpg)
అంబటి రాంబాబు
కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం.. పవన్‌కు ఉందా?: అంబటి రాంబాబు
ఇక, పవన్ సినిమాలపైనా స్పందిస్తూ.. ఆయన సినిమాలు ఆపాల్సిన ఖర్మ ప్రభుత్వానికి లేదన్నారు. సినిమా టికెట్లపై ఒక పాలసీ తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఒక్కో సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏపీ అప్పులపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రాష్ట్రానికే కాదు, కేంద్రానికీ రూ.121లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పుకొచ్చారు అంబటి.
ఇదీ చూడండి:Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి.. వైకాపా హానికరం : పవన్
Last Updated : Dec 13, 2021, 8:20 AM IST