ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవుతామనే భయంతోనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని వైకాపా విమర్శించింది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లు తామే గెలిచామని తెదేపా సంబరాలు చేసుకుందని..పార్టీ గుర్తుపై జరిగిన పురపాలక ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యేసరికి అంతా సైలెంటయ్యారన్నారు.
'ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ'
ఓటమి భయంతోనే చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారని వైకాపా ఆరోపించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే పోటీ చేయాలన్నారు వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
గతంలో జరిగిన మున్సిపాలిటీల్లో తెదేపా కేవలం ఒకే ఒక్క పురపాలికను దక్కించుకుందని.. పరిషత్ ఎన్నికల్లోనూ ఓటమిపాలవుతామనే తప్పుకుంటున్నారని ఆక్షేపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు అసలు నమ్మకం ఉందా అని ప్రశ్నించిన అంబటి.. నమ్మకం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తిరుపతిలో కూడా పోలింగ్‌కు ముందే పారిపోతారని.. పార్లమెంట్‌కు, అసెంబ్లీకి కూడా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్ధితి వస్తుందన్నారు. తర్వాత తెదేపాను కూడా చంద్రబాబు రద్దు చేస్తారని అంబటి జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: