ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని భూముల్లో 5 శాతం పేదలకే: ఆళ్ల - రాజధాని భూముల ఇష్యూ న్యూస్

సీఆర్​డీఏ చట్టానికి లోబడే... రాజధాని భూముల్లో 5 శాతం పేదలకు కేటాయిస్తున్నామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రస్తుతం కేవలం 12 వందల 50 ఎకరాలనే ఇంటి స్థలాలకు కేటాయించినట్లు తెలిపారు.

ysrcp mla about capital lands
ysrcp mla about capital lands

By

Published : Feb 26, 2020, 5:49 PM IST

భూముల పంపిణీపై వివరణ ఇస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి

రాజధానిలో మొత్తం 54 వేల ఎకరాలు ఉందని.. దీని ప్రకారం సుమారు 2,600 ఎకరాలు పేదలకు ఇవ్వాలని సీఆర్​డీఎ చట్టం చెబుతోందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 1,250 ఎకరాలనే పేదల ఇంటి స్థలాలకు కేటాయించిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో రాజధానిలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం జగన్ నిర్ణయం వల్ల లక్షన్నర నుంచి రెండు లక్షల మంది జనాభా అమరావతికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక్కడ స్థలాలు పొందిన పేదల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని... వీరంతా రాజధానిలోకి రాకుండా చంద్రబాబు చేశారని ఆక్షేపించారు. రాజధానిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ఆళ్ల తెలిపారు. రాజధానిలో ఇంటి స్థలాల పంపిణీని కమ్యూనిస్టు పార్టీలు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతించకపోతే... కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిందని భావించాల్సి ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details