MINISTER FIRES ON PAWAN COMMENTS: కొత్త ప్యాకేజీలో భాగంగానే చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొట్టు సత్యనారాయణ.. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్మాదుల్లా ప్రసంగాలు చేయరన్నారు. కాపు యువతను పెడదోవ పట్టించేలా ప్రవన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కర్రకు కర్ర, కత్తికి కత్తి, రాళ్లకు రాళ్లు అని ఎవరూ మాట్లాడరన్న ఆయన.. ఇవన్నీ ఉగ్రవాద చర్యలన్నారు. పవన్ ఒక్కరే చెప్పులు చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత అసహనంతో మాట్లాడుతున్న పవన్‌ను రాజకీయ నాయకుడిగా ఎలా గుర్తిస్తారని మంత్రి ప్రశ్నించారు. రంగా హత్య కేసుతో సంబంధం ఉన్నవారితో పవన్ కల్యాణ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నారు. అసహనం ఎక్కువై చెప్పులు చూపడానికి.. రాజకీయం సినిమా కాదని అన్నారు.
పవన్ చెప్పు చూపిస్తే.. వైకాపాలో చిన్నపిల్లాడు కూడా భయపడడు: మంత్రులు - పవన్‌పై ఆగ్రహించిన వైకాపా మంత్రులు
MINISTERS FIRES ON PAWAN : జనసేన అధినేత చెప్పు చూపించటంపై వైకాపా మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. చెప్పు చూపిస్తే వైకాపాలో ఉండే చిన్నపిల్లోడు కూడా భయపడడని అన్నారు. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే.. వైకాపా కార్యకర్తలు వందల చెప్పులు చూపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
జనసేన పార్టీలో ఎవరూ ఎదగకుండా.. అందరితోనూ చేతులు కలుపుతున్న పవన్ కల్యాణ్.. రాజకీయ వ్యభిచారి అని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో విలువలుండాలని.. సిద్ధాంతాలపై పోరాటం చేయాలనే వ్యక్తులు కర్రలతో, రాళ్లతో కొట్టుకుందామని పిలుపునిస్తారా అని ప్రశ్నించారు. చెప్పులు చూపించి ఉద్రేకపరిచే మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆక్షేపించారు. పవన్ చెప్పులు చూపిస్తే భయపడే వ్యక్తులెవరూ వైకాపాలో లేరని.. అసలు ఆ స్థాయి పవన్‌కు లేదని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ అంటే ఈర్ష్య, అసూయలతోనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే.. వైకాపా కార్యకర్తలు వందలాది చెప్పులు చూపిస్తారని మండిపడ్డారు.
ఇవీ చదవండి:
- Tension: అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. వాటర్ బాటిళ్లు విసిరిన వైకాపా శ్రేణులు
- ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం: చంద్రబాబు, పవన్‌కల్యాణ్
- పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ