ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ గర్జనను పక్కదారి పట్టించేందుకే దాడులు: మంత్రులు

MINISTERS FIRES ON JANASENA ACTIVISTS : తమపై దాడికి పాల్పడింది జనసేన కార్యకర్తలేనని వైకాపా నేతలు ఆరోపించారు. విశాఖ గర్జన విజయవంతమైనందుకే ఈ దాడులకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కార్లపై దాడికి యత్నించిన జనసేన కార్యకర్తలను వదిలి పెట్టె ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

MINISTERS FIRES ON JANASENA ACTIVISTS
MINISTERS FIRES ON JANASENA ACTIVISTS

By

Published : Oct 15, 2022, 10:14 PM IST

MINISTERS FIRE : విశాఖ గర్జనను పక్కదారి పట్టించేందుకే మంత్రులపై దాడి జరిగిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. వైకాపా నేతలపై దాడికి పూర్తి బాధ్యత పవన్‌కల్యాణ్‌ దేనన్నారు. జనసేన దాడి ఉత్తరాంధ్రుల ఉద్యమం పైనేనన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే గర్జనరోజు పవన్‌ విశాఖ కార్యక్రమం పెట్టుకున్నారన్నారు.

మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది: వైకాపా మంత్రులు, శ్రేణుల మీద జనసేన పార్టీ కార్యకర్తల దాడులు దారుణమని మంత్రి రోజా విమర్శించారు. ఈ దాడిలో పలువురు మంత్రుల వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. మంత్రి విడదల రజినిపై జనసేన కార్యకర్తలు అసభ్యకర మాటలతో దూషించారని మండిపడ్డారు. రజని భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. అమరావతి ఉద్యమం పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమమని విమర్శించారు.

మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని మండిపడ్డారు. తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్​ని రెచ్చగొట్టే ఈరోజు విశాఖపట్నం పంపించారన్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మిస్తామంటే కోర్టుల ద్వారా తెలుగుదేశం అడ్డుపడుతుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు.

పవన్​ క్షమాపణలు చెప్పాలి: విశాఖ విమానాశ్రయంలో వైకాపా నేతలపై జనసైనికులే దాడి చేశారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రపై దాడికి పవన్ చేపట్టిన పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిందన్నారు. పవన్ అనుచరులు వైకాపా నాయకులపైన దాడి చేశారని.. ప్రశాంతమైన విశాఖలో అశాంతిని సృష్టించారని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలన్నారు. ఈ ఘటనపై పవన్ ఇప్పటి వరకు స్పందించలేదని.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జనసేన కార్యకర్తలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: విశాఖ గర్జన అనంతరం విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనపై వైకాపా మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల కార్లపై దాడికి యత్నించిన జనసేన కార్యకర్తలను వదిలి పెట్టె ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మంత్రులు అని కనీసం గౌరవం లేకుండా నడుచుకోవడం దారుణమన్నారు. విశాఖ గర్జన విజయవంతం అవ్వడం సహించలేకే ఈ దాడులు అని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి ఏకైక రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాలని కోరాలి తప్ప.. తమ కార్లపై కర్రలు, రాళ్లతో దాడులు సరికాదని సూచించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details