కేంద్ర ప్రభుత్వం రూ.116 లక్షల కోట్ల అప్పులు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలోనే రూ.25 లక్షల కోట్ల అప్పు చేసిందని, కేంద్రం ముందు ఏపీ చేసిన అప్పు ఎంత? అని ప్రశ్నించారు. భాజపా నేతలు మతం, ఆర్థిక అంశాల ప్రాతిపదికన ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా దుష్ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అర్థమవుతోందని ధ్వజమెత్తారు.
‘సీఎం జగన్ లాంటి బలమైన నేతను దెబ్బతీయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయన కుటుంబం అనుసరించే విశ్వాసాన్ని భాజపా నేతలు బలహీనతగా భావిస్తున్నారు. అది బలహీనత కాదు’ అని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సజ్జల మాట్లాడారు. ‘భాజపా.. మతాన్ని రెచ్చగొడుతూ బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులను ప్రభావితం చేసేలా ప్రమాదకర దుష్ప్రచారం సాగిస్తోంది.