శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీకి దిగిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ధ్రువీకరించారు. ఆరు స్థానాలకు సోమవారంతో నామినేషన్ల గడువు ముగియగా.. ఆరుగురు మాత్రమే బరిలో నిలిచారు.
అభ్యర్థులు దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కరీమున్నిసా, చల్లా భగీరథరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు సోమవారం అసెంబ్లీలో ఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రాలు స్వీకరించారు. వీరు అక్కడే ఉన్న శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంను మర్యాదపూర్వకంగా కలిశారు. మహమ్మద్ ఇక్బాల్, సి.రామచంద్రయ్య గెలుపు ధ్రువపత్రాలను తీసుకోవాల్సి ఉంది.