ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్టోబర్ 4 నుంచి వైఎస్​ఆర్​ వాహన మిత్ర - వైఎస్​ఆర్​ వాహన మిత్ర

ఆటో, ట్యాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించే వై.ఎస్.ఆర్ వాహన మిత్ర పథకం అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అక్టోబర్ 4 నుంచి వైఎస్​ఆర్​ వాహన మిత్ర

By

Published : Sep 28, 2019, 6:55 AM IST

అక్టోబర్ 4 నుంచి వైఎస్​ఆర్​ వాహన మిత్ర

సొంతంగా ఆటో, ట్యాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించే వై.ఎస్.ఆర్ వాహన మిత్ర పథకం అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు లక్షా 75 వేలకుపైగా దరఖాస్తులు రాగా... వీటి పరిశీలన ప్రక్రియను రవాణాశాఖ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. 93 వేల 741 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఆమోద ముద్ర వేశారు. ఈనెల 30 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగనుంది.

అర్హుల జాబితాను ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్‌లకు పంపుతున్నారు. వై.ఎస్.ఆర్ వాహన మిత్ర పథకాన్ని వచ్చే నెల 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచే ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. సొంతగా ఆటోలు, టాక్సీలు కొనుగోలు చేసి... వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేయనుంది.

ఇదీ చదవండీ... ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవి విరమణ @ 60..!

ABOUT THE AUTHOR

...view details