రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమాన్ని పలు చోట్ల..ప్రజాప్రతినిధులు,అధికారులు లాంఛనంగా ప్రారంభించారు.తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాశ్ రైతుభరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు.విజయనగరం జిల్లా చీపురు పల్లిలో రైతుభరోసా కార్యక్రమాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.రైతుకు భరోసా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూలు జిల్లా డోన్‌లో అన్నారు.ఆలూరు కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం,విజయనగరం జిల్లా పార్వతీపురం,శ్రీకాకుళం జిల్లా రణస్థలం,ప్రకాశం జిల్లా ఒంగోలు,గిద్దలూరు,కడప జిల్లా జమ్మలమడుగు,కమలాపురం,చిత్తూరు జిల్లా పుంగనూరు,అనంతపురం జిల్లా ఉరవకొండ,శింగనమలలో ఎమ్మెల్యేలు,అధికారులు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా రైతు భరోసా కార్యక్రమం - ysr raithu bharosa in 2019
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమాన్ని పలు చోట్ల.. ప్రజాప్రతినిధులు, అధికారులు లాంఛనంగా ప్రారంభించారు.
![రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా రైతు భరోసా కార్యక్రమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4761014-421-4761014-1571144044890.jpg)
అట్టహాసంగా రైతు భరోసా కార్యక్రమం
అట్టహాసంగా రైతు భరోసా కార్యక్రమం