అక్టోబర్ 10 నుంచి 'వైఎస్సార్ కంటివెలుగు' - ysr kanti velugu in ap
అక్టోబర్ 10 నుంచి 'వైఎస్సార్ కంటివెలుగు' పథకం అమలు కానుంది. ఇప్పటికే పథకం విధివిధానాలు ఖరారయ్యాయి. అన్ని పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించడమే తొలిదశ . అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకూ తొలిదశ నిర్వహించనున్నారు.
![అక్టోబర్ 10 నుంచి 'వైఎస్సార్ కంటివెలుగు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4475584-thumbnail-3x2-velugu.jpg)
అక్టోబర్10నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ వైఎస్సార్ కంటివెలుగు పథకం ప్రారంభించబోతున్నందున...అందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలన్న అంశంపై విధివిధానాలు సైతం రూపొందించారు. 6దశల్లో వైఎస్సార్ కంటివెలుగును అమలు చేయనుండగా....రెండేళ్లల్లో రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కంటి చికిత్సలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కోటిన్నర నుంచి రెండు కోట్ల మందికి లబ్ధి చేకూరే అవకాశముందంటున్న వైద్యవిధాన పరిషత్ దుర్గాప్రసాదరావుతో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి.
TAGGED:
ysr kanti velugu in ap