‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల పథకం మొదటి దశ కింద ముఖ్యమంత్రి జగన్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా పాల్గొంటారని ప్రభుత్వం బుధవారం తెలిపింది. మొదటి దశ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది. మూడు విభాగాలుగా గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఆయా ఐచ్ఛికాల ఎంపికను లబ్ధిదారులకే వదిలేసింది. వారు ఎంచుకున్న ప్రకారం తొలిదఫాలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ పేరిట నిర్మిస్తుంది. సొంతగా కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుంది. సొంత స్థలాలు ఉండి, ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుంది. ఇలాంటి వారు మరో 4.33 లక్షల మంది ఉన్నారు. జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుంది. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకును అందిస్తుంది.
jagananna house: వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం - CM Jagan News
2023 నాటికి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' హామీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం నేడు ప్రారంభం కానుంది. సీఎం జగన్ తాడేపల్లి నుంచి వర్చువల్‌గా పనులు ప్రారంభించనున్నారు.
మలి విడతలో 12.70 లక్షల ఇళ్లు
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా 2023 జూన్ నాటికి ప్రభుత్వం రెండు దశల్లో 28,30,227 పక్కా గృహాలను రూ.50,994 కోట్లతో నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశ పథకాన్ని 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో విడత కింద 12.70 లక్షల ఇళ్లను రూ.22,860 కోట్లతో నిర్మించనుంది. దీని గడువు 2023 జూన్‌గా నిర్దేశించుకుంది.
ఇదీ చదవండీ... CM Jagan Review: భూరక్ష పథకం చురుగ్గా ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి