ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం నగదు - Good News For Farmers

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద మొదట విడత ఆర్థిక సాయాన్ని రైతులకు ప్రభుత్వం విడుదల చేసింది.. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్ లైన్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా ఆర్థిక సాయాన్ని జమ చేశారు.

వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నగదు జమ
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నగదు జమ

By

Published : May 13, 2021, 12:55 AM IST

Updated : May 13, 2021, 11:40 AM IST

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద మొదట విడతగా 3 వేల 900 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్ లైన్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా ఆర్థిక సాయాన్ని జమ చేశారు. మొత్తం 52.38 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగనుంది.

2019-20 సంవత్సరంలో 46. 69 లక్షల రైతు కుటుంబాలకు 6,173 కోట్లు, 2020-21 సంవత్సరంలో 51.59 లక్షల మందికి 6,928 కోట్లు అందజేసినట్టు సర్కారు వెల్లడించింది. ప్రస్తుత ఏడాది 52.38 లక్షల మంది రైతులకు మొదటి విడతగా 3,900 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీలో సాగుచేసే యానాం రైతులకు, కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ అందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండీ... ఈ నెల 20న అసెంబ్లీ సమావేశం.. నేడే నోటిఫికేషన్!

Last Updated : May 13, 2021, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details