ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన ప్రభుత్వం - నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2020-23 సంవత్సరాలకు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది. పారిశ్రామిక అనుమతుల వేగవంతానికి 'వైఎస్‌ఆర్‌ ఏపీ వన్' పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా నూతన పాలసీని విడుదల చేశారు.

ysr ap one New Ind Policy in ap
ysr ap one New Ind Policy in ap

By

Published : Aug 10, 2020, 12:39 PM IST

Updated : Aug 10, 2020, 3:06 PM IST

నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అనుమతుల కోసం 'వైఎస్​ఆర్ ఏపీ వన్'‌ పేరిట సింగిల్‌ విండో కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. కొత్త పాలసీని మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా విడుదల చేశారు. కొత్త విధానంతో అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. రాయితీలతో నూతన విధానం ఉండటం మహిళగా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

కొవిడ్ పరిస్థితిల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో 'వైఎస్సార్ ఏపీ వన్' పేరిట కొత్త విధానం తెచ్చామని తెలిపారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం ఉన్న యువతను ఈ పరిశ్రమలకు అందించటమే లక్ష్యంగా నూతన విధానం ఉపకరిస్తుందన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం ఈ ఏడాది మార్చితో గడువు పూర్తి అయ్యిందని... మంచి అంశాలే ఉన్నా అది అమలు సాధ్యం కాని అంశాలను గత ప్రభుత్వం అందులో చొప్పించారని అన్నారు. ఆ హామీలు అమలు చేయడం జాతీయ స్థాయిలోను సాధ్యం కాదని పేర్కొన్నారు. అందుకే కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించామని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీన్ని అమలు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు.

వచ్చే మూడేళ్ల కాలానికి ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. విస్తృతమైన వనరుల సమర్ధ వినియోగం, భారీ నుంచి సూక్ష్మ స్థాయి పరిశ్రమకు సమాన అవకాశాలు కల్పించే విధంగా పారిశ్రామిక విధానాన్ని రూపొందించినట్లు మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. రెడీ బిల్ట్ ప్రి క్లియర్డ్ మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక జోనింగ్, లీజు కం బై అవుట్ ప్రాతిపదికన భూముల కేటాయింపు, ప్రమాద రహిత పారిశ్రామిక వ్యవస్థల ఏర్పాటు, 'వైఎస్ఆర్ ఏపీ వన్' పేరిట సింగిల్ విండో అనుమతుల కేంద్రం ఏర్పాటు.. తదితర అంశాల ఆధారంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

  • నూతన పారిశ్రామిక విధానాలు...

మౌలిక వసతులు

  • అనుమతి పొందిన సంస్థలకు పారిశ్రామిక స్థలాలు కేటాయించడం
  • మధ్య తరహా పారిశ్రామిక పార్కుల అభివృద్ధి
  • ఆ పార్కుల్లో పారిశ్రామిక ఉత్పత్తులకు అవసరమైన అన్నీ సదుపాయాల కల్పన
  • అవసరమైన రంగాల్లో భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు
  • ప్రత్యేక వాహకాల ద్వారా ఈ పరిశ్రమలకు నీటి సరఫరా
  • కొత్త పారిశ్రామిక పార్కులకు అవసరమైన మేరకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా
  • నూతన సాంకేతికత స్టార్టప్​​లకు ప్రోత్సాహం
  • పాత ఏపీఐఐసీ భూ విధానంలో మార్పులు
  • అన్ని పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణహిత స్థిరాభివృద్ధిని ప్రోత్సహించడం
  • తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వాటి బెడద లేకుండా చర్యలు

సరళతర వ్యాపార విధానం

  • డిమాండ్​కు అనుగుణంగా ఎం​ఎస్​ఎమ్మీలకు అనుమతులు
  • సమస్యల పరిష్కారానికి సింగిల్ డెస్క్ పోర్టల్ ఏర్పాటు
  • క్షేత్ర స్థాయిలో అనుమతుల కోసం ఒక సహాయ కేంద్రం ఏర్పాటు
  • జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తరచూ పారిశ్రామిక సమావేశాలు నిర్వహించి.. సమస్యలు అనుమతులకు సంబంధించి విషయాలు పరిష్కరించడం
  • తరచూ రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ కమిటీ (పరిశ్రమలకు సంబంధించి) సమావేశమై రుణాల సమస్యలు పరిష్కరించడం

నైపుణ్యం- మానవ వనరులు

  • 2 నైపుణ్యాభివృద్ధి యూనివర్శిటీలు.. 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు
  • విద్యావిధానం.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు
  • పారిశ్రామిక అవసరాలను గుర్తించి వాటిపై దృష్టి సారించనున్న నైపుణ్యాభివృద్ధి యూనివర్శిటీలు
  • సాంకేతిక బయో టెక్నాలజీ టెక్ట్స్ టైల్ డిజైనింగ్ , పెట్రోకెమికల్, ఆహార రంగంలో ప్రపవంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను పరిశీలన
  • పరిశ్రామిక రంగం కొత్తవిధానంలో డిజిటల్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన మానవ వనరులను అందించడం
  • వైఎస్‌ఆర్‌ ఏపీ వన్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన అన్ని సేవలను అందించడం

ప్రోత్సాహకాలు

  • సూక్ష్మ , చిన్నతరహా సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం
  • సంస్థలు ఇచ్చే ఉద్యోగ అవకాశాలను బట్టి భారీ మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమలకు 5 సంవత్సరాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్ చేయడం

ప్రత్యేక విభాగంగా గుర్తింపునకు ఉండాల్సిన లక్షణాలు

  • ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సహకాలు
  • ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని భూముల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు పారిశ్రామిక వేత్తలకు కేటాయింపు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి పారిశ్రామిక వేత్తలకు వైఎస్‌ఆర్‌ ఏపీ వన్ లో ప్రత్యేక సెల్

చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..

  • చిన్న పరిశ్రమల అవసరాలకు కొనుగోలు చేసే భూమిపై 100 శాతం స్టాంప్ డ్యూటీ, బదిలీ డ్యూటీ రీయింబర్స్​మెంట్​
  • చిన్న పరిశ్రమల కోసం లీజుకు తీసుకునే భూమి ఆస్తులు, షెడ్డు, భవనాలు, తనకాలకు సంబంధించిన భూమిపై 100శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్​మెంట్​.
  • 24x7 నాణ్యమైన విద్యుత్​ను నిరంతరం సరఫరాచేస్తారు. అలా పంపించే వాటికి.. వాణిజ్య ఉత్పత్తి ప్రాంభించిన తేదీనుంచి 5ఏళ్ల పాటు యూనిట్​కు ఒక రూపాయి చొప్పున మాత్రమే విద్యుత్ ఛార్జీల బిల్లులు రీయింబర్స్​మెంట్​ .
  • 20 లక్షల లోపు ఫిక్సడ్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పై 15శాతం పెట్టుబడి సబ్సిడీ. ఈ సబ్సిడీని 3 సంవత్సరాల తరువాత ప్రభుత్వం అందచేస్తుంది.
  • ఉత్పత్తి, ఉద్యోగాలకు సంబంధించి 80 శాతం లక్ష్యాన్ని సాధించిన సంస్థలకు ఇది వర్తిస్తుంది.
  • వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి 5 సంవత్సరాల వరకు టర్మ్​లోన్ పై 3 శాతం వడ్డీ రాయితీ.
  • ల్యాండ్ కన్వర్షన్ చార్జీలపై 25 శాతం రీయింబర్స్​మెంట్​ .
  • ప్రభుత్వ నిర్దేశిత పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు నీరు, విద్యుత్ వంటి సదుపాయాలను ప్రభుత్వమే అందుబాటులోకి తెస్తుంది.

ఇదీ చదవండి:కరోనా ఉగ్రరూపం: రెండు కోట్లు దాటిన కేసులు

Last Updated : Aug 10, 2020, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details