ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YS Viveka Murder Case: హైకోర్టులో వైఎస్​ వివేకా కేసు.. హాజరైన సునీత

vivekananda
హైకోర్టుకు హాజరైన వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత

By

Published : May 4, 2022, 11:24 AM IST

Updated : May 4, 2022, 12:36 PM IST

11:21 May 04

నిందితుల తరఫున హైకోర్టులో ఇప్పటికే పూర్తయిన వాదనలు

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5) బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే నిందితుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ సీబీఐ, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో సునీత న్యాయస్థానానికి హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ మీద ఉన్నారు. నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించారని.. వారికి ఎటువంటి ప్రాణహాని లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందువల్ల నిందితులకు బెయిల్‌ ఇవ్వాలని ఇప్పటికే కోర్టును కోరారు.

గత సోమవారం శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే సునీత తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ వాదనలూ వినాలని అనుబంధ పిటిషన్‌ (ఇంప్లీడ్‌) దాఖలు చేశామని తెలిపారు. మృతుడి కుమార్తెగా ఆమె ఇంప్లీడ్‌ అయ్యేందుకు అర్హత ఉందని చెప్పారు. గతంలో శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ను ఓ న్యాయమూర్తి కొట్టేశారని, ప్రస్తుత వ్యాజ్యం అక్కడికే విచారణకు వెళ్లాలని కోర్టు దృష్టికి తెచ్చిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: MPP Elections: దుగ్గిరాలలో ఎన్నికల వేళ.. వారికి భద్రత కల్పించాలి: ఎస్​ఈసీ

Last Updated : May 4, 2022, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details