హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణికాలనీలో వైఎస్ షర్మిల దీక్షకు కూర్చున్నారు. మృగాడి చేతిలో అత్యాచారనికి(హత్యకు కూడా గురైంది) గురైన బాలిక కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిల.. బాధతో కుంగిపోతున్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పారు. తాము అందరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా... నిందితున్ని పట్టుకోకపోవటంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధిత కుటుంబంతో కలిసి దీక్ష ప్రారంభించారు. హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకూ దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే.. ఇలా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
5 గంటలుగా షర్మిల దీక్ష-సంఘీభావం తెలిపిన విజయమ్మ
చిన్నారి ఇంటి సమీపంలో 5 గంటలుగా షర్మిల దీక్ష కొనసాగుతోంది. చంపాపేట వద్ద సాగర్ రోడ్డుపై వైతెపా కార్యకర్తలు బైఠాయించారు. చంపాపేట్, కర్మన్‌ఘాట్ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చిన్నారి తల్లిదండ్రులను వైఎస్ విజయమ్మ పరామర్శించి.. ఓదార్చారు. అనంతరం షర్మిల చేపట్టిన దీక్షకు వైఎస్ విజయమ్మ (Ys Vijayamma) సంఘీభావం తెలిపారు.