రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్సార్ కుమార్తె షర్మిల (YS Sharmila) తొలిసారిగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ములుగు మండలం ఒంటిమామిడి కూరగాయల మార్కెట్ ముందు ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అదే విధంగా రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించారు. అల్మాస్‌పూర్‌లోని కరోనా మృతుల కుటుంబాలను పరామర్శించారు.
రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని ఆమె అన్నారు. సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని వైఎస్ షర్మిల (YS Sharmila) తెలిపారు. త్వరలో తెలంగాణకు మంచి రోజులొస్తున్నాయని భరోసా ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న వైఎస్ షర్మిల.. ఆ దిశగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలో తొలిసారి సభ జరగనుండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.