ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ys Sharmila: తెలంగాణలో నేడు వైఎస్ షర్మిల నల్గొండ జిల్లా పర్యటన - Ys Sharmila latest news

వైఎస్ షర్మిల.. ఇవాళ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను షర్మిల తెలుసుకోనున్నారు. నియామకాల నోటిఫికేషన్లు రాక ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించనున్నారు.

SHARMILA TOUR
SHARMILA TOUR

By

Published : Jun 16, 2021, 7:04 AM IST

తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. ఇవాళ ఆ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్​లోని లోటస్‌పాండ్‌ నుంచి వైఎస్ షర్మిల నల్గొండ జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యకు యత్నించిన నీలకంఠ సాయి.. అతని కుటుంబాన్ని 10:30 గంటలకు పరామర్శిస్తారు. 12:45 గంటలకు హుజూర్‌నగర్‌ సర్కిల్​లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించనున్నారు. 2:30 గంటలకు కోదాడ సమీపంలోని దొండపాడులో వైఎస్‌ఆర్‌ అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని కలుస్తారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి బయల్దేరనున్నట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details