ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు 'ఖమ్మం' నేతలతో వైఎస్ షర్మిల భేటీ - నేడు ఖమ్మం నేతలతో షర్మిల భేటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి కుమార్తె వైఎస్​ షర్మిల... తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్,​ ఉమ్మడి ఖమ్మం నేతలతో భేటీ కానున్నారు.

ys sharmila
ys sharmila

By

Published : Feb 15, 2021, 12:40 PM IST

తెలంగాణలో వైఎస్​ షర్మిల నూతన పార్టీ ఏర్పాటు ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్థానిక రాజకీయాలపై పట్టు సాధించేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వైకాపా నేతలు, వైఎస్సార్ అభిమానులతో షర్మిల... హైదరాబాద్​లో భేటీ కానున్నారు.

పార్టీ ఏర్పాటు చేయకముందే తనతో వచ్చే నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవానికి ఈ నెల 21న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున... ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశం కానున్నట్టు వెల్లడించారు. ఇవాళ షర్మిల నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు ఖమ్మం నుంచి వైఎస్సార్ అభిమానులు హైదరాబాద్​కు బయలుదేరి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details