తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement in Telangana) చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YSRTP founder YS Sharmila) దీక్ష చేయనున్నారు. 72 గంటల పాటు చేపట్టనున్న దీక్షలో..హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. మిగతా 48 గంటలు లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగించనున్నారు. రైతులకు అండగా(YSRTP supports farmers) ఉండేందుకు షర్మిల(YSRTP founder YS Sharmila) ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్రానికి వ్యతిరేకంగా తెరాస ధర్నా..
ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement in Telangana)పై ఇటు అధికార తెరాస, అటు భాజపాలు ధర్నాలు చేశాయి. రైతుల పట్ల కేంద్ర విధానాలు నిరసిస్తూ ఈనెల 12న తెరాస తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు(TRS dharna over paddy procurement) దిగింది. ఈ ధర్నాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్డీఏ సర్కార్ కర్షకుల పట్ల అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే.. రైతులు ఏం చేయాలని? పండించిన పంటంతా ఏమవ్వాలని తెరాస మంత్రులు ప్రశ్నించారు. దేశమంతా వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.