ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆత్మహత్యలు చేసుకోవద్దు.. నిరుద్యోగుల కోసం పోరాడతా : షర్మిల - Dharna Chowk near Indira Park

హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ వద్ద షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్షను పోలీసులు భగ్నం చేయడం.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల దురుసు ప్రవర్తనతో...షర్మిల దుస్తులు చిరిగి... గాయాలయ్యాయని... ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్‌ నుంచి లోటస్‌పాండ్‌కు చేరుకున్న షర్మిల... ఇంటి వద్దే దీక్ష కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్​ బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు.

SHARMILA
SHARMILA

By

Published : Apr 16, 2021, 9:21 AM IST

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ.. హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద వైఎస్​ షర్మిల చేపట్టిన 'ఉద్యోగదీక్ష'... ఉద్రిక్త పరిణామాల మధ్య కొనసాగుతోంది. గురువారం ఉదయం దీక్ష ప్రారంభించిన షర్మిల... తన తండ్రి వైఎస్‌కు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన అమరులకు సంతాపం తెలిపారు. సామాజిక వేత్త కంచె ఐలయ్య, బీసీ నేత ఆర్​.కృష్ణయ్య షర్మిలకు సంఘీభావం తెలిపారు. షర్మిలను... ఆమె తల్లి విజయమ్మ వేదికపై ఆశీర్వదించి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటలకు గడువు ముగిసిందని.... దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. లోటస్‌పాండ్‌లోనైనా దీక్ష కొనసాగిస్తానంటూ షర్మిల కాలినడకన తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ మీదుగా బయలుదేరారు. దీంతో పాదయాత్రకు అనుమతి లేదంటూ... పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో షర్మిల అనచరులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో పెద్దసంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో షర్మిల దుస్తులు స్వల్పంగా చిరిగాయి. చేతికి గాయమవటంతోపాటు కాసేపు సొమ్మసిల్లారు.

72 గంటల పాటు నిరాహార దీక్ష

షర్మిలను పోలీసులు తమ వాహనంలోనే లోటస్‌పాండ్‌ వద్దకు చేర్చారు. అయినప్పటికీ తాను దీక్షను కొనసాగిస్తానంటూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని.... 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తేల్చిచెప్పారు. తనపై చేయి వేస్తే ఊరుకునేది లేదని పోలీసులను హెచ్చరించారు. ఏదో ఒకరోజు తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని వైఎస్ షర్మిల‌ ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబంలో

జులై 8న తాను పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని.... పాదయాత్ర వివరాలను అదేరోజున వెల్లడిస్తానని షర్మిల తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత, విద్యార్థులు ముందుండి పోరాడారని... నేడు వారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం తాను పోరాడతానని... ఎవరూ నిరాశకు గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

ఆ తీరు సరికాదు

లోటస్‌పాండ్ దీక్షా శిబిరం వద్ద షర్మిలను వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పరామర్శించారు. శాంతియుతంగా దీక్ష చేసి... తిరిగి వస్తున్న షర్మిలపై.. పోలీసుల వ్యవహరించిన తీరు సరికాదని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆడ పోలీసులతోపాటు మగవాళ్లు కూడా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని ఇందిరా శోభన్‌ ఆరోపించారు. షర్మిలపై దాడికి పాల్పడటాన్ని పోలీసుల సంస్కారానికే వదిలేస్తున్నామని షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ తెలిపారు.

ఇదీ చూడండి :కొవిడ్​తోనే రక్తం గడ్డకట్టే ముప్పు అధికం!

ABOUT THE AUTHOR

...view details