ఏపీలో పార్టీ పెట్టడంపై స్పందించిన వైఎస్ షర్మిల
13:16 January 03
హైదరాబాద్‌లో మీడియాతో వైఎస్ షర్మిల చిట్‌చాట్
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టడంపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పెడతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అని ప్రశ్నించారు.
తెరాస సీనియర్ నేత, బీసీ నాయకుడు గట్టు రాంచందర్‌రావు ఇవాళ వైతెపాలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి రామచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదీ చూడండి:YSR Rythu Bharosa: 'వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్' నిధుల విడుదల