ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏప్రిల్ 9న పార్టీ ఏర్పాటుపై ప్రకటన: వైఎస్ షర్మిల - ఖమ్మంలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన

ఏప్రిల్ 9న పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తామని వైఎస్ షర్మిల వెల్లడించారు. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల... లక్ష మంది సమక్షంలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.

ys sharmila
ys sharmila

By

Published : Mar 16, 2021, 6:34 PM IST

ఏప్రిల్ 9న పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల... లక్ష మంది సమక్షంలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని ఉద్ఘాటించారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికే పార్టీ పెడుతున్నానని పేర్కొన్నారు. తాను తెరాసకో లేక భాజపాకో బి టీమ్‌ కాదన్నారు.

ఖమ్మం వేదికగానే సమర శంఖం పూరిద్దామని వైఎస్​ అభిమానులకు షర్మిల మాటిచ్చారు. పార్టీ ఏర్పాటు, విధి విధానాలపై నేతలకు వివరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిలను అభిమానులు కోరినట్లు సమాచారం.

ఇదీ చూడండి:

తిరుపతి ఉపఎన్నిక: ఏప్రిల్​ 17న ఎన్నికలు.. మే 2న ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details