తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ వద్ద షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహర దీక్ష కొనసాగించేలా... ఎంపిక చేసిన జిల్లాల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు షర్మిల.
YS Sharmila: పాలమూరు యూనివర్సిటీ వద్ద వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష - షర్మిల నిరుద్యోగ దీక్ష
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ వద్ద షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
తొలిసారిగా జులైలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తాడిపర్తి గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించిన షర్మిల.. నిరుద్యోగుల ఆహ్వానం మేరకు ఇవాళ మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీక్షకు వెళ్తున్న సమయంలో జడ్చర్ల వద్ద వైఎస్ విగ్రహానికి షర్మిల నివాళి అర్పించారు.
ఇదీ చూడండి:Kala Venkat Rao: రైతులను సీఎం జగన్ నష్టాల ఊబిలోకి నెట్టారు: కళా వెంకట్రావు