తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు.. అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి.. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం జగన్ సహా పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
'నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.