ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించండి.. సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్' - jagan cbi cases

పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి.. దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.

YS Jagan
YS Jagan files discharge petition in CBI Court

By

Published : Jul 13, 2021, 3:06 PM IST

హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. పెన్నా కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. సబిత డిశ్చార్జి పిటిషన్‌పై విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను ఈ నెల 22కు, ఇండియా సిమెంట్స్ కేసు విచారణను కోర్టు.. ఈనెల 28కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details