పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపర్చిన అభ్యర్థులు గెలుపు ఇచ్చిన ఆనందం ఒకెత్తయితే, యువత సాధించిన విజయం మరింత ఆనందాన్నిచ్చిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ సర్పంచిగా డిగ్రీ విద్యార్థిని సలుగు మాధవి గెలిచి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో మార్పు రావాలంటూ ఇంట్లో కూర్చొని బాధపడితే ఉపయోగం ఉండదని... మాధవి లాంటివారిని స్ఫూర్తిగా తీసుకోని మరికొంత మంది యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని లోకేశ్ పేర్కొన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది: లోకేశ్ - AP Panchayat elections news
పంచాయతీ ఎన్నికల్లో యువత సాధించిన విజయం ఆనందాన్నిచ్చిందని నారా లోకేశ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటూ ఇంట్లో కూర్చొని బాధపడితే ఉపయోగం ఉండదని... మాధవి లాంటివారిని స్ఫూర్తిగా తీసుకోని మరికొంతమంది యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని లోకేశ్ పేర్కొన్నారు.
![యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది: లోకేశ్ Youth need to get into politics: Lokesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10697933-46-10697933-1613755285621.jpg)
Youth need to get into politics: Lokesh