తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ స్టేడియం గ్రౌండ్ వేదికగా జాతీయ పారామోటర్ ఛాంపియన్ షిప్ పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు టాస్కుకు సంబంధించి రెండు విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. టేకాఫై జడ్జీలు నిర్ణయించిన ప్రదేశంలో సురక్షితంగా ల్యాండ్ కావడం టాస్క్.
లక్షిత ప్రదేశానికి ఎంత దగ్గరగా ల్యాండ్ అయితే అన్ని ఎక్కువ పాయింట్లు కేటాయిస్తారు. లక్షిత ప్రదేశానికి దూరంగా ల్యాండ్ అయితే వారికి తక్కువ పాయింట్లిస్తారు. రెండో రోజు ఈ టాస్కును క్రీడాకారులు పూర్తి చేశారు. పారామోటార్ను టేకాఫ్ చేసే క్రమంలో ఓ క్రీడాకారుడి మోటార్ పక్కకు ఒరిగి స్వల్పంగా గాయపడ్డారు.
జాయ్‌రైడ్స్...
టాస్కులు ముగిసిన తర్వాత జాయ్ రైడ్స్ సైతం చేపట్టారు. మహబూబ్‌నగర్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు పోటీలను ఆసక్తిగా తిలకించారు. కొందరు రుసుములు చెల్లించి జాయ్ రైడ్స్‌లో సైతం పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులను ఉత్సాహ పరించేందుకు పారామోటార్లో నేలపై కొద్ది దూరం ప్రయాణించారు. జాతీయ స్థాయి క్రీడలకు పాలమూరు వేదిక కావడం సంతోషంగా ఉందన్న ఆయన... భవిషత్తులో కోయిల్‌సాగర్, సోమశిల, ఉదండాపూర్, కర్వెన రిజర్వాయర్ల వద్ద ఈ తరహా పోటీలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.